డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారు

ABN , First Publish Date - 2021-11-21T07:25:55+05:30 IST

బీజేపీ పశ్చిమ బెంగాల్‌ నేత, మేఘాలయ మాజీ గవర్నర్‌ తథాగథ రాయ్‌ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారని వ్యాఖ్యానించారు....

డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారు

బీజేపీ బెంగాల్‌ నాయకత్వంపై ఆ పార్టీ నేత ధ్వజం


కోల్‌కతా, నవంబరు 20: బీజేపీ పశ్చిమ బెంగాల్‌ నేత, మేఘాలయ మాజీ గవర్నర్‌ తథాగథ రాయ్‌ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు డబ్బు, మహిళలకు లొంగిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు. అయితే, త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల వరకు విమర్శలకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఆ ఎన్నికల ఫలితాలే పరిస్థితిని చెబుతాయన్నారు. తానేమీ వార్తల్లో నిలిచేందుకు విమర్శలు చేయడం లేదని.. పార్టీని మేల్కొలిపేందుకే మాట్లాడుతున్నానని వివరించారు.  తనపై ఏం చర్యలు తీసుకున్నా ఫర్వాలేదని తేల్చి చెప్పారు. 

Updated Date - 2021-11-21T07:25:55+05:30 IST