బురఖాపై శ్రీలంకలో నిషేధం!

ABN , First Publish Date - 2021-03-14T07:08:28+05:30 IST

బురఖాపై నిషేధం విఽధించేందుకు శ్రీలంక ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తోంది. శ్రీలంకలో వెయ్యికి పైగా ఉన్న ఇస్లామిక్‌ స్కూళ్లను కూడా బ్యాన్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని

బురఖాపై శ్రీలంకలో నిషేధం!

కొలంబో, మార్చి 13: బురఖాపై నిషేధం విఽధించేందుకు శ్రీలంక ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తోంది. శ్రీలంకలో వెయ్యికి పైగా ఉన్న ఇస్లామిక్‌ స్కూళ్లను కూడా బ్యాన్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన ఫైలుపై సం తకం చేశానని ఆ దేశ ప్రజా రక్షణ శాఖ మంత్రి శరత్‌ వీరశేఖర శనివారం ప్రకటించారు. ఈ ఫైలును కేబినెట్‌ ఆమోదానికి పంపించామన్నారు. ‘‘ఒకప్పుడు శ్రీలంకలోని ముస్లిం మహిళలు బురఖా ధరించేవారు కారు. ఇది ఇటీవల మొదలైంది. ఇది మతపరమైన అతివాదానికి గుర్తు. దీన్ని దేశ భద్రతకు ప్రమాదంగా భావిస్తున్నాం. దీన్ని కచ్చితంగా బ్యాన్‌ చేసి తీరుతాం’’ అని శరత్‌ వీరశేఖర స్పష్టం చేశారు. 2019లో చర్చిలపై దాడి అనంతరం శ్రీలంకలో బురఖా ధరించడంపై పాక్షిక నిషేధం విధించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఇటీవలే తొలగించారు.

Updated Date - 2021-03-14T07:08:28+05:30 IST