బోసిపోతున్న ‘బళ్లారి’
ABN , First Publish Date - 2021-05-08T16:50:53+05:30 IST
కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడంతో ఉదయం పది గంటల తర్వాత నగరం నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా మారుతోంది. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు

బళ్లారి(కర్ణాటక): కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడంతో ఉదయం పది గంటల తర్వాత నగరం నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా మారుతోంది. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారు. అనంతరం కర్ఫ్యూ విధిస్తున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమించి రోడ్లపైకి వస్తే పోలీసులు జరిమానా విధించడంతో పాటు.. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో నగరంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బళ్లారి ఆర్టీసీ బస్టాండు, కొత్త మోకా సర్కిల్, ప్రధాన వీధులన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి.