కేంద్ర మంత్రి బబూల్ సుప్రియోకు పరాభవం?

ABN , First Publish Date - 2021-05-02T18:44:03+05:30 IST

కేంద్ర మంత్రి, ప్రముఖ గాయకుడు బబూల్ సుప్రియోకు పరాభవం ఎదురుకానుందా? గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది

కేంద్ర మంత్రి బబూల్ సుప్రియోకు పరాభవం?

కోల్‌కతా : కేంద్ర మంత్రి, ప్రముఖ గాయకుడు బబూల్ సుప్రియోకు పరాభవం ఎదురుకానుందా? గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ‘టోలీగంజ్’ నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ 30300 ఓట్లను సాధించి, ముందువరుసలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి బబూల్ సుప్రియో 16078 ఓట్లను సాధించారు. అంటే తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ 14222 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. మరిన్ని రౌండ్లు లెక్కింపు జరిగిన తర్వాత ఫలితాలు మారుతాయేమో వేచి చూడాలి.

Updated Date - 2021-05-02T18:44:03+05:30 IST