భారత సంతతి వ్యక్తికి దక్షిణాఫ్రికా అవార్డు

ABN , First Publish Date - 2021-12-26T07:04:58+05:30 IST

భారత సంతతికి చెందిన వితరణశీలి, ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది గివర్స్‌’ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ ...

భారత సంతతి వ్యక్తికి  దక్షిణాఫ్రికా అవార్డు

జోహాన్నె్‌సబర్గ్‌, డిసెంబరు 25 : భారత సంతతికి చెందిన వితరణశీలి, ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది గివర్స్‌’ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ సులేమాన్‌ ప్రతిష్ఠాత్మక ‘సౌత్‌ ఆఫ్రికన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలతో అస్తవ్యస్తమైన 44 దేశాల్లో ఆయన సంస్థ ప్రజలకు అండగా నిలిచింది. ఇప్పటివరకు ఆ సంస్థ రూ. 1960 కోట్ల వరకు సాయం అందించింది. ముస్లింలు అన్ని వర్గాల ప్రజలకు చేయూత అందించాలని శుక్రవారం ఆయన కేప్‌టౌన్‌ నుంచి పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-26T07:04:58+05:30 IST