చోరీ యత్నం ఫలించలేదని.. ఏం చేశాడంటే !

ABN , First Publish Date - 2021-08-11T01:00:07+05:30 IST

మధ్యప్రదేశ్: చోరీ యత్నం ఫలించలేదని ఓ దొంగ ఏకంగా ఏటీఎం సెంటర్‌నే కాల్చేశాడు. మధ్యప్రదేశ్‌ కార్గొనే జిల్లాలో ఓ దొంగ చోరీ చేయాలని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు.

చోరీ యత్నం ఫలించలేదని.. ఏం చేశాడంటే !

మధ్యప్రదేశ్: చోరీ యత్నం ఫలించలేదని ఓ దొంగ ఏకంగా ఏటీఎం సెంటర్‌నే కాల్చేశాడు. మధ్యప్రదేశ్‌ కార్గొనే జిల్లాలో ఓ దొంగ చోరీ చేయాలని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అయితే చోరీ యత్నం ఫలించలేదు. దీంతో ఆ దొంగకు కోపం వచ్చింది. వెంటనే అందులో పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు స్పందించారు. ఏటీఎంను కాల్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-08-11T01:00:07+05:30 IST