గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్...13 మంది మావోయిస్టుల మృతి
ABN , First Publish Date - 2021-05-21T15:38:20+05:30 IST
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారు...

గడ్చిరోలి (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారు.గడ్చిరోలి జిల్లా పేడి-కొటమి ఎటపల్లి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సి-60 విభాగానికి చెందిన ప్రత్యేక సాయుధ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గాలిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ లో మరింతమంది మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో మావోయిస్టులకు చెందిన మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.