కొలంబియాలో గ్రెనెడ్ దాడి: 14మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-13T13:03:25+05:30 IST

కొలంబియా దేశంలో గ్రెనెడ్ దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తాజాగా జరిగింది.

కొలంబియాలో గ్రెనెడ్ దాడి: 14మందికి గాయాలు

బొగొటా (కొలంబియా): కొలంబియా దేశంలో గ్రెనెడ్ దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తాజాగా జరిగింది. కొలంబియా దేశంలోని బర్రాన్ ఖిల్లా నగర ప్రాంతంలో గ్రెనెడ్ దాడి జరిగింది. పట్టపగలు జరిగిన గ్రెనెడ్ దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొలంబియా దేశంలో గతంలోనూ కారులో వెళుతున్న కొందరు షాపింగ్ మాల్ పై గ్రెనెడ్ విసిరి పారిపోయారు. జనసమ్మర్ధ ప్రాంతంలో గ్రెనెడ్ విసరడం వల్ల 14 మంది గాయాల పాలయ్యారు. పోలీసులు అప్రమత్తమై గాలింపు చేపట్టారు.

Updated Date - 2021-01-13T13:03:25+05:30 IST