ఆ ఏడుగురి విడుదలపై ఇంకా నిర్ణయం ప్రకటించని గవర్నర్‌

ABN , First Publish Date - 2021-02-01T13:36:04+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ముద్దాయిలు మురుగన్‌, నళిని, పేరరి వా లన్‌ సహా ఏడుగురి విడుదలపై సుప్రీం కోర్టు ప్రకటించిన గడువు పూర్తయినా రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌పురోహిత్‌ తన నిర్ణయాన్ని...

ఆ ఏడుగురి విడుదలపై ఇంకా నిర్ణయం ప్రకటించని గవర్నర్‌

చెన్నై(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ముద్దాయిలు మురుగన్‌, నళిని, పేరరి వా లన్‌ సహా ఏడుగురి విడుదలపై సుప్రీం కోర్టు ప్రకటించిన గడువు పూర్తయినా రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌పురోహిత్‌ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేకున్నారు. పేరరివాలన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ప్పుడు రాజీవ్‌హత్యకేసు ముద్దాయిల విడుదలపై నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వారం లోపున గవర్నర్‌ నిర్ణయాన్ని ప్రకటిం చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వారం రోజులుగా ఈ విషయంపై గవర్నర్‌ న్యాయనిపుణులతో మంతనాలు జరిపారు. రెండు రోజుల క్రితం సీఎం ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్‌ను కలుసుకుని ఏడుగురి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవా లని వినతిపత్రం కూడా సమర్పించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవుదినాలు కావడంతో గవర్నర్‌ సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే పేరరివాలన్‌ అభ్యర్థన ప్రాతి పదికగా నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌ వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ కీలక అంశంపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఏ ప్రాతిపదికన ఆమోదించాలనే విషయంపై న్యాయ నిపుణులతో గవర్నర్‌ సంప్రదిస్తూనే ఉన్నారు.

Updated Date - 2021-02-01T13:36:04+05:30 IST