భవిష్యత్తు స్టార్ట్‌ప్‌లదే!
ABN , First Publish Date - 2021-02-06T07:45:46+05:30 IST
ఆర్థిక రంగంలో భవిష్యత్తు స్టార్టప్‌లదేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులోని యెలహంకలో జరిగిన

నాలుగేళ్లలో 4.7లక్షల కొలువులు సృష్టించాం: రాజ్‌నాథ్
ఏరో ఇండియా అపూర్వ విజయం: రాష్ట్రపతి కోవింద్
బెంగళూరు, ఫిబ్రవరి 5: ఆర్థిక రంగంలో భవిష్యత్తు స్టార్టప్‌లదేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులోని యెలహంకలో జరిగిన ఏరో ఇండియా-21 ‘స్టార్టప్ మంథన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్(ఐడెక్స్)లో భాగంగా ఉన్న స్టార్టప్ సంస్థలకు కేటాయించే నిధుల్ని పెంచాలని అధికారులకు సూచించాను. భారత ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో స్టార్ట్‌పలే శాసిస్తాయంటే ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ.. ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా 41వేలకు పైగా స్టార్టప్ సంస్థలను, 4.7 లక్షల కొలువులను సృష్టించాం’ అని తెలిపారు.
కాగా.. ఏరో ఇండియా-21 కార్యక్రమం అపూర్వ విజయం సాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ‘‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారత్ ఎదుగుదలకు ఈ ఏడాది ఏరో ఇండియా సాధించిన విజయమే సాక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు.