అరుణాచలేశ్వరుడికి వైభవంగా అన్నాభిషేకం

ABN , First Publish Date - 2021-10-21T13:08:51+05:30 IST

అరుణాచలేశ్వరాలయంలో అన్నాభిషేకం వైభవంగా జరిగింది. బుధవారం తెలవా రుజామున 4 గంటలకు ఆలయం తెరచి, అన్నామలై యార్‌, ఉన్నామలై అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక

అరుణాచలేశ్వరుడికి వైభవంగా అన్నాభిషేకం

వేలూరు(chennai): అరుణాచలేశ్వరాలయంలో అన్నాభిషేకం వైభవంగా జరిగింది. బుధవారం తెలవా రుజామున 4 గంటలకు ఆలయం తెరచి, అన్నామలై యార్‌, ఉన్నామలై అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ, దీపారాధనలు చేశారు. సాయంత్రం అన్నామలైయార్‌ గర్భాలయంలోని శివలింగానికి, కల్యాణ సుందరేశ్వర సన్నిధిలో అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలకు భక్తులను అనుమతించలేదు. అలాగే, పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణకు గత ఏడాది మార్చి నెల నుంచి 20వ నెలగా భక్తులకు నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సమాచారం లేకుండా గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులను అధికారులు, పోలీసులు వెనక్కు పంపించారు. 

Updated Date - 2021-10-21T13:08:51+05:30 IST