సొరంగంలో 30-35 మంది!

ABN , First Publish Date - 2021-02-08T07:34:41+05:30 IST

జలప్రళయం కారణంగా ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలోని ‘తపోవన్‌-విష్ణుగడ్‌ జలవిద్యుత్కేంద్రం’ సొరంగంలో చిక్కుకు పోయిన 30-35 మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి...

సొరంగంలో 30-35 మంది!

తపోవన్‌, ఫిబ్రవరి 7: జలప్రళయం కారణంగా ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలోని ‘తపోవన్‌-విష్ణుగడ్‌ జలవిద్యుత్కేంద్రం’ సొరంగంలో చిక్కుకు పోయిన 30-35 మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. నీటిమట్టం రాత్రి మళ్లీ పెరుగుతున్నట్టు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దీంతో.. సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలను నిలిపివేశారు. మళ్లీ సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-02-08T07:34:41+05:30 IST