సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్ధమేనా?
ABN , First Publish Date - 2021-11-26T09:04:04+05:30 IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఆరుగురు ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం వివాదాస్పదమవుతోంది.

జైపూర్, నవంబరు 25: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఆరుగురు ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం వివాదాస్పదమవుతోంది. ఈ మేరకు నియామకానికి సంబంధించిన రాజ్యాంగ బద్ధతపై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, రాజస్థాన్ సీఎ్‌సను ఆదేశించారు. సీఎంకు ఆరుగురు సలహాదారులను నియమించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై విపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్ నుంచి కల్‌రాజ్ మిశ్రా వివరణ కోరారు.