జంతర్‌మంతర్‌ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు

ABN , First Publish Date - 2021-08-10T08:40:50+05:30 IST

జంతర్‌మంతర్‌ వద్ద ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

జంతర్‌మంతర్‌ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: జంతర్‌మంతర్‌ వద్ద ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్‌ జోడో ఆందోళన్‌ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి, అడ్వకేట్‌ అశ్విని ఉపాధ్యాయ్‌ నాయకత్వాన జంతర్‌మంతర్‌ వద్ద ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినవారితో తమకు ఎటువంటి సంబంధంలేదని బీజేఏ మీడియా ఇన్‌చార్జి షిప్రా శ్రీవాత్సవ చెప్పారు. 222 బ్రిటీష్‌ చట్టాలను రద్దుచేయాలంటూ తాము ప్రదర్శన జరిపామన్నారు.  

Updated Date - 2021-08-10T08:40:50+05:30 IST