అమ్మా మందుల దుకాణంలో రూ.5లక్షల దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-09-02T14:47:13+05:30 IST

రాష్ట్ర సహకార సంఘం ఆధ్వర్యంలో పోరూరు ట్రంక్‌ రోడ్డులో నడుపుతున్న అమ్మా మందుల దుకాణంలో రూ.5లక్షల మేరకు దుర్వినియోగం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మందుల దుకాణంలో ఫార్మా

అమ్మా మందుల దుకాణంలో రూ.5లక్షల దుర్వినియోగం

                       - ఇద్దరి అరెస్టు


చెన్నై: రాష్ట్ర సహకార సంఘం ఆధ్వర్యంలో పోరూరు ట్రంక్‌ రోడ్డులో నడుపుతున్న అమ్మా మందుల దుకాణంలో రూ.5లక్షల మేరకు దుర్వినియోగం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మందుల దుకాణంలో ఫార్మాసిస్ట్‌ సుభాషిణి, కేకేనగర్‌కు చెందిన క్రిస్టోఫర్‌ పనిచేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ మందుల దుకాణంలో అమ్మకాలపై అధికారులు తనిఖీలు జరిపినప్పుడు రూ.5లక్షల విలువైన మందుల అమ్మకాలకు సంబంధించి బిల్లులేవని కనుగొన్నారు. దీనితో సహకార సంఘం ఉన్నతాధికారులు విచారణ జరిపినప్పుడు సుభాషిణి, క్రిస్టోఫర్‌లు కలిసి రూ.5 లక్షల విలువైన మందులను విక్రయించి ఆ సొమ్మును కాజేసినట్టు నిర్ధారణ అయ్యింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆ ఇరువురిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-09-02T14:47:13+05:30 IST