గెలిపిస్తే అసోంకు వరదల నుంచి విముక్తి: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-03-15T01:30:07+05:30 IST

బీజేపీకి మరో సారి అధికారం ఇస్తే వరదల తాకిడి నుంచి అసోంకు శాశ్వత విముక్తి కలిగిస్తామని ..

గెలిపిస్తే అసోంకు వరదల నుంచి విముక్తి: అమిత్‌షా

శివసాగర్: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరిగి బీజేపీని ఎన్నుకుంటే అసోంను వరదల తాకిడి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. నిజీరాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి మరో సారి అధికారం ఇస్తే వరదల తాకిడి నుంచి అసోంకు శాశ్వత విముక్తి కలిగిస్తామని చెప్పారు. అసోంను ఉగ్రవాదం నుంచి విముక్తి చేస్తామని ఐదేళ్ల క్రితం తాము హామీ ఇచ్చామని, ఉగ్రవాద ఉద్యమంతో నజీరాలో ఒక్క యువకుడు కూడా మరణించ లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బబ్రుద్దీన్ అజ్మల్‌కు ఓటు వేయడమేనని, ఆయనకు ఓటు వేస్తే అసోంను చొరబాటుదారులతో నింపివేయడమే అవుతుందని చెప్పారు. చొరబాటుదారులతో నింపే పార్టీ కావాలో, చొరబాటుదారులను బయటకు పంపే పార్టీ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. చొరబాటుదారులను రాష్ట్రం నుంచి తిప్పిపండటం బీజేపీ మాత్రమే చేయగలదని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-15T01:30:07+05:30 IST