ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ ఫ్రాంతం సేఫ్.. 5వేలకు పైగా అమెరికా సైనికులు..

ABN , First Publish Date - 2021-08-20T07:47:49+05:30 IST

పూర్తిగా తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఓ సేఫ్ ప్లేస్ ఉందట. ఈ విషయం అమెరికా స్వయంగా చెబుతోంది. ఆఫ్ఘన్ రాజధాని ..

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ ఫ్రాంతం సేఫ్.. 5వేలకు పైగా అమెరికా సైనికులు..

వాషింగ్టన్: పూర్తిగా తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఓ సేఫ్ ప్లేస్ ఉందట. ఈ విషయం అమెరికా స్వయంగా చెబుతోంది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ సురక్షితంగానే ఉందని అమెరికా గురువారం ప్రకటించింది. అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ విలియం హాంక్ టేలర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 5,200 మంది అమెరికా ఆర్మీ జవాన్లు అక్కడ కాపలా కాస్తున్నారని, ఆ ప్రాంతం నుంచి విమానాలు ఎగిరేందుకు అనుకూలంగానే ఉందని చెప్పారు. కాగా.. ఆగస్టు 14 నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. వారికి ఈ విమానాశ్రయం నుంచే తరలిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 7వేల మందిని తరలించినట్లు హాంక్ తెలిపారు.

Updated Date - 2021-08-20T07:47:49+05:30 IST