వ్యాక్సిన్‌ సాయానికి అమెరికా సిద్ధం

ABN , First Publish Date - 2021-05-30T09:53:12+05:30 IST

భారత్‌కు వ్యాక్సిన్లు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ సుముఖంగా ఉన్నారని, అక్కడ వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు కూడా సహకరిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌

వ్యాక్సిన్‌ సాయానికి అమెరికా సిద్ధం

వాషింగ్టన్‌, మే 29: భారత్‌కు వ్యాక్సిన్లు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ సుముఖంగా ఉన్నారని, అక్కడ వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు కూడా సహకరిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ హామీ ఇచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య వ్యాక్సిన్లకు సంబంధించి చర్చ జరిగింది. కరోనా తొలినాళ్లలో భారత్‌ తమ దేశానికి అందించిన సాయాన్ని మరువలేమని, ప్రస్తుతం కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని బ్లింకెన్‌ స్పష్టం చేశారు.  అమెరికా చేస్తున్న సాయానికి జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తోనూ జైశంకర్‌ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ బంధాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించినట్లు జైశంకర్‌ వెల్లడించారు.


మోదీ 2.0కు రెండేళ్లు పూర్తి.. కొవిడ్‌ నీడలోనే వేడుకలు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. అయితే కరోనా రెండో దశ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుడి లాగే ఈ ఏడాది కూడా కొవిడ్‌ నీడలోనే బీజేపీ నేతలు వేడుకలు జరుపుకోనున్నారు. 

Updated Date - 2021-05-30T09:53:12+05:30 IST