అమర్‌నాథ్ యాత్రలో ఈసారి సామూహిక రిజిస్ట్రేషన్‌కు అవకాశం

ABN , First Publish Date - 2021-03-21T13:53:15+05:30 IST

అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28న ప్రారంభమై...

అమర్‌నాథ్ యాత్రలో ఈసారి సామూహిక రిజిస్ట్రేషన్‌కు అవకాశం

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28న ప్రారంభమై, ఆగస్టు 22 రక్షా బంధన్ రోజున ముగియనుంది. అమర్‌నాథ్ యాత్రికుల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్‌లకు సంబంధించిన 446 బ్రాంచిలలో ఏప్రిల్ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి అమర్‌నాథ్ యాత్రలో సాధారణ రిజిస్ట్రేషన్‌తో పాటు ఐదుగురు, అంతకన్నా ఎక్కువమంది ప్రయాణికులకు సంబంధించిన సామూహిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టారు. 


ఈ విధానం యాత్రలోని రెండు మార్గాలైన బాల్టాలా, పహల్‌గామ్‌లకు కూడా వర్తించనుంది. సామూహిక రిజిస్ట్రేషన్ కోసం ప్రతీ యాత్రికుడు రూ. 200 ఫీజు చెల్లించాల్సివుంటుంది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసు లేదా 75 ఏళ్లు పైబడినవారు రిజిస్ట్రేషన్‌కు అనర్హులు. ముందుగా వచ్చినవారికి ముందుగా రిజిస్ట్రేషన్ విధానం కొనసాగనుంది. సామూహిక రిజస్ట్రేషన్ కోసం ఆరోగ్య ధృవీకరణపత్రం తప్పనిసరి. గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా సాధుసన్యాసులు మాత్రమే అమర్‌నాథ్ యాత్ర చేయగలిగారు. 

Updated Date - 2021-03-21T13:53:15+05:30 IST