ఆల్మట్టి ఎడమ కాలువ డీపీఆర్‌కు ఆమోద ముద్ర
ABN , First Publish Date - 2021-12-31T17:50:16+05:30 IST
ఆల్మట్టి ఎడమ కాలువకు నుంచి 68.24 కిలోమీటర్ల వరకు బాకీ ఉన్న ఫీడర్ కాల్వల ఆధునికీకరణపనులకు పాలనా పరమైన అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లకు ఆమోదముద్ర దక్కిందని జలవనరుల శాఖ గురువారం విడుదల

బెంగళూరు: ఆల్మట్టి ఎడమ కాలువకు నుంచి 68.24 కిలోమీటర్ల వరకు బాకీ ఉన్న ఫీడర్ కాల్వల ఆధునికీకరణపనులకు పాలనా పరమైన అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లకు ఆమోదముద్ర దక్కిందని జలవనరుల శాఖ గురువారం విడుదల ప్రకటనలో తెలిపింది. మొత్తం మూడు ప్యాకేజీలలో ఆల్మట్టి ఎడమకాలువ ఆధునీకరణ పనుల కాంట్రాక్టులను కేటాయించిన సంగతి విదితమే. ఈ మూడు విభాగాల పనులకు సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చుకాగలదని అంచనావేస్తున్నారు. ఆల్మట్టి ఎడమకాలువ ఆ ధునికీకరణ పూర్తయితే లక్షలాది హెక్టార్లకు సాగునీరు అందుబాటులోకి రానుంది.