‘ముక్కు ద్వారా వ్యాక్సిన్’కు అనుమతివ్వండి
ABN , First Publish Date - 2021-01-20T08:00:52+05:30 IST
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్(ఇంట్రానాసల్ వ్యాక్సిన్) తొలి దశ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా భారత ఔషధ నియంత్రణ సంస్థకు(సీడీఎ్‌ససీవో) చెందిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

సీడీఎ్‌సఎసీవో నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ, జనవరి 19: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్(ఇంట్రానాసల్ వ్యాక్సిన్) తొలి దశ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా భారత ఔషధ నియంత్రణ సంస్థకు(సీడీఎ్‌ససీవో) చెందిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ వ్యాక్సిన్ పనిచేస్తే కరోనాపై పోరాటం తీరునే మార్చేస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ టీకా ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు(డీసీజీఐ) దరఖాస్తు చేసింది. తొలి దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యం, రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసే శక్తికి సంబంధించిన డేటా ఆధారంగా రెండో దశ ట్రయల్స్‌కు అనుమతిస్తామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతానికి ‘‘బీబీవీ154’’ అనే సాంకేతికనామంతో వ్యవహరిస్తున్న ఈ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ టెస్టింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క చుక్కను ఒక్కొక్క నాసికారంధ్రంలో వేస్తే సరిపోతుంది.