ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం

ABN , First Publish Date - 2021-11-28T16:21:32+05:30 IST

ఈరోజు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది.

ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఈరోజు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్యసభా పక్ష నేతలతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు భేటీ కానున్నారు. 


Updated Date - 2021-11-28T16:21:32+05:30 IST