ఈ ఏడాది చివరినాటికల్లా అందరికీ టీకాలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
ABN , First Publish Date - 2021-05-20T17:25:30+05:30 IST
ఈ ఏడాది చివరినాటికల్లా భారతదేశానికి 267 కోట్ల...

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరినాటికల్లా భారతదేశానికి 267 కోట్ల మోతాదుల యాంటీ-కోవిడ్ -19 వ్యాక్సిన్ అందుతుందని, అప్పటికి దేశంలోని దాదాపు అన్ని వయస్కుల జనాభాకు టీకాలు వేసే స్థితిలో ఉంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం, జూలైలో 51 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్, ఆగస్టు- డిసెంబర్ మధ్య కాలంలో 216 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ మనకు అందుతుందన్నారు. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు వేసేలా చూడాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో చర్చలు జరిపిన హర్షవర్ధన్... 2021 ఆగస్టు- డిసెంబర్ మధ్య కాలంలో భారతదేశానికి 216 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ లభిస్తుందన్నారు. జూలై ఒకటి నాటికి 51 మిలియన్ మోతాదులు అందుతుందని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలోని అధికశాతం మందికి టీకాలు వేసే స్థితి ఏర్పడుతుంది. కాగా పశ్చిమ బెంగాల్‌తోపాటు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, అలాగే కరోనా వ్యాప్తి రేటు కూడా పెరుగుతున్నదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.