నిందితుడినీ, బాధితురాలినీ చావబాదారు!
ABN , First Publish Date - 2021-03-30T07:44:18+05:30 IST
ఆమె 16 ఏళ్ల బాలిక.. పైపెచ్చు రేప్ బాధితురాలు. నరక యాతన పడిన ఆ బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులే నిందితుడితో పాటు తాళ్లతో బంధించి చావబాదారు! రోడ్డుపై ఊరేగింపుగా నడిపించి యాతనకు గురిచేశారు
భోపాల్, మార్చి 29: ఆమె 16 ఏళ్ల బాలిక.. పైపెచ్చు రేప్ బాధితురాలు. నరక యాతన పడిన ఆ బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులే నిందితుడితో పాటు తాళ్లతో బంధించి చావబాదారు! రోడ్డుపై ఊరేగింపుగా నడిపించి యాతనకు గురిచేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో పోలీసులు బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.