శత్రు డ్రోన్లపై యాంటీ డ్రోన్‌ గన్స్‌ గురి!

ABN , First Publish Date - 2021-07-15T07:57:57+05:30 IST

వాయుసేన కార్యాలయంపై, జమ్ము ఎయిర్‌పోర్టులో జరిగిన డ్రోన్‌ దాడి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం..

శత్రు డ్రోన్లపై యాంటీ డ్రోన్‌ గన్స్‌ గురి!

ప్రతి 15-20 కి.మీ. దూరంలో మోహరించే యత్నాలు

న్యూఢిల్లీ, జూలై 14: వాయుసేన కార్యాలయంపై, జమ్ము ఎయిర్‌పోర్టులో జరిగిన డ్రోన్‌ దాడి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. సరిహద్దులకు ఆవల నుంచి వచ్చే డ్రోన్లకు చెక్‌పెట్టే ఏర్పాట్లలో నిమగ్నమైంది. మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించిన యాంటీ డ్రోన్‌ గన్లను ఉపయోగించేందుకు సిద్ధమైంది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు పొడవునా ప్రతి 15-20 కిలోమీటర్ల దూరంలో ఆ గన్లను మోహరించాలన్నది రక్షణ శాఖ యోచన. డీఆర్డీవో రూపొందించిన ఈ కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీ శత్రు డ్రోన్ల పనిపట్టడంలో సాయుధ దళాలకు అద్భుతంగా ఉపయోగపడనుంది. సరిహద్దులకు ఆవలి నుంచి వచ్చే డ్రోన్లను 3 కిలోమీటర్ల దూరంలోనే పసిగట్టి, వాటిని పనిచేయకుండా (జామ్‌) చేసే సామర్థ్యం, ఒక 1-2.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను లేజర్‌ సంకేతాలతో కూల్చే సత్తా ఈ యాంటీ డ్రోన్‌ గన్లకు ఉన్నట్టు సమాచారం. లేజర్‌ ఆధారత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ డ్రోన్‌ గన్లు పనిచేస్తాయని తెలుస్తోంది. 

Updated Date - 2021-07-15T07:57:57+05:30 IST