అహ్మద్‌నగర్ జిల్లాలో ‘no vaccine no entry’...కలెక్టర్ సంచలన ఉత్తర్వులు
ABN , First Publish Date - 2021-12-25T16:06:20+05:30 IST
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక జిల్లా కలెక్టరు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు....

అహ్మద్ నగర్ : మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక జిల్లా కలెక్టరు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ టీకాలు వేయించుకోని వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లోకి శనివారం నుంచి అనుమతించమని అహ్మద్ నగర్ కలెక్టరు సంచలన ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ టీకాలు వేయించుకోని వారు ప్రైవేటు సంస్థలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, ఆడిటోరియంలు, మ్యారేజ్ హాళ్లు, ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అనుమతించమని అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.కొవిడ్ టీకాలు వేయించుకోని వారు బహిరంగ కార్యాలయాలు, ప్రదేశాల్లో ప్రవేశించడానికి అనుమతించమని కలెక్టరు చెప్పారు.
అహ్మద్ నగర్ జిల్లా కలెక్టరు ఉత్తర్వులకు ముందు నాసిక్ జిల్లాలోనూ నో వ్యాక్సిన్ నో ఎంట్రీ ఆర్డరును అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 108 ఒమైక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు.రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది.మహారాష్ట్రలో శుక్రవారం 1,410 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66,54,755కి చేరుకుంది.