3 జిల్లాల్లో తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ రెసిస్టెన్స్ ఫోర్స్.. స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-21T16:41:34+05:30 IST

తాలిబన్లలపై తిరుగుబాటు దారులు అనేక చోట్ల నుంచి దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను..

3 జిల్లాల్లో తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ రెసిస్టెన్స్ ఫోర్స్.. స్వాధీనం

కాబూల్: తాలిబన్లలపై తిరుగుబాటు దారులు అనేక చోట్ల నుంచి దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడు జిల్లాల్లో అక్కడి తాలిబన్లను మట్టుబెట్టిన రెసిస్టెన్స్ ఫోర్స్‌ ఆ జిల్లాలను తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బఘ్లన్ ప్రావిన్స్‌లోని దిల్ సలాహ్, పుల్-ఈ-హెసర్, బానో జిల్లాలు ప్రస్తుతం విముక్తి లభించినట్లు తెలుస్తోంది. అక్కడి తాలిబన్లపై తిరుగుబాటుదారులు మెరుపు దాడి చేయడంతో.. దాదాపు 60 మంది తాలిబన్లు చనిపోయినట్లు, తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిరుగుబాటుదారులు ఇతర జిల్లాలపై కూడా పట్టు సాధించేందుకు ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-08-21T16:41:34+05:30 IST