కొవిడ్ బూస్టర్ డోసు: అధర్ పూనావాలా
ABN , First Publish Date - 2021-10-22T02:07:44+05:30 IST
వచ్చే ఏడాది ప్రారంభానికి కొవిడ్ బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పూనావాలా తెలిపారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైన సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇది మరింత వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభానికి కొవిడ్ బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పూనావాలా తెలిపారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైన సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇది మరింత వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయమై అదర్ పూనావాలా మాట్లాడుతూ ‘‘ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ముందుగా రెండు డోసుల టీకా అందించాలి. అక్కడ కనీసం మూడు శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తి కాలేదు. ఇండియాలో రెండు డోసుల వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. బూస్టర్ గురించి కూడా మాట్లాడుతున్నాం’’ అని అన్నారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవ్వడంపై ప్రధాని మోదీకి అధర్ పూనావాలా కృతజ్ణతలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఇండియా కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని అధర్ హర్షం వ్యక్తం చేశారు.