ఆసుపత్రిలో చేరిన నటుడు దొడ్డణ్ణ

ABN , First Publish Date - 2021-08-27T16:09:35+05:30 IST

ప్రముఖ శాండిల్‌వుడ్‌ నటుడు దొడ్డణ్ణ అనారోగ్యంతో జయనగర్‌లోని జయదేవ ఆసుపత్రిలో చేరారు. హృదయ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు జయదేవ ఆసుప

ఆసుపత్రిలో చేరిన నటుడు దొడ్డణ్ణ

బెంగళూరు: ప్రముఖ శాండిల్‌వుడ్‌ నటుడు దొడ్డణ్ణ అనారోగ్యంతో జయనగర్‌లోని జయదేవ ఆసుపత్రిలో చేరారు. హృదయ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు జయదేవ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. జయదేవ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా హార్ట్‌బీట్‌ 70-80ల మధ్య ఉండేదని కానీ ఒక్కసారిగా 20-30కు తగ్గిపోవడంతో ఫేస్‌మేకర్‌ను అమర్చామన్నారు. ప్రస్తుతానికి దొడ్డణ్ణ చికిత్సలు స్పందిస్తున్నారన్నారు. మరో మూడురోజుల పాటు చికిత్సలు అవసరమన్నారు. ఆదివారం తర్వాత పరిస్థితిని బట్టి చికిత్సలు మారుస్తామన్నారు. 


Updated Date - 2021-08-27T16:09:35+05:30 IST