మాంసం వినియోగానికి వ్యతిరేకంగా వినేత్న నిరసన

ABN , First Publish Date - 2021-05-19T03:05:07+05:30 IST

రోడ్డుపై ప్లాక్టిక్ కవర్‌లో తమను నగ్నంగా తాము బంధించుకొని ఒంటిపై రక్తంలా కనిపించే ద్రవాలు చల్లుకున్నారు. సూపర్ మార్కెట్‌లో మాంసం ప్యాకెట్లు ఉన్నట్లుగానే ఉండే విధంగా తమను తాము ఇలా మలుచుకున్నారన్నమాట

మాంసం వినియోగానికి వ్యతిరేకంగా వినేత్న నిరసన

మాడ్రిడ్: నిరసనలు చాలా రకాలుగా ఉంటాయి. వందల మంది ఒక్క చోటకి చేరి నినాదాలు చేయడం, కొద్ది రోజుల పాటు ఒక ప్రాంతంలో ఉంటూ నిరసన చేపట్టడం, ర్యాలీలు తీయడం లాంటివి మనకు బాగా తెలిసిన నిరసనలు. ఇక వీటితో పాటు కొన్ని వింతగాను, కొత్తగానూ, వినూత్నంగాను కూడా నిరసనలు చేస్తుంటారు. తాజాగా స్పెయిన్‌లో కూడా ఓ వినూత్నమైన నిరసన చేశారు. మాంసం వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించే జంతు ప్రేమికులు కొందరు చేసిన ఈ వినూత్న నిరసన చూడడానికి కాస్త జుగుప్సాకరంగానూ, ఎక్కువగా ఆలోచించే విధంగానూ ఉందని నెటిజెన్లు అంటున్నారు.


రోడ్డుపై ప్లాక్టిక్ కవర్‌లో తమను నగ్నంగా తాము బంధించుకొని ఒంటిపై రక్తంలా కనిపించే ద్రవాలు చల్లుకున్నారు. సూపర్ మార్కెట్‌లో మాంసం ప్యాకెట్లు ఉన్నట్లుగానే ఉండే విధంగా తమను తాము ఇలా మలుచుకున్నారన్నమాట. అంతే కాకుండా మాంసం ప్యాకెట్లపై బార్‌ కోడ్ బిల్లు ఉన్నట్లుగానే వీరిని కవర్లపై కూడా అలాంటి లేబుల్స్ వేశారు. కొంత మంది జంతు ప్రేమికులు కలిసి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఓ రోడ్డులో ఈ విధంగా నిరసన తెలిపారు. జంతువులు కూడా మనలాంటి జీవాలే. మన ఆకలి కోసం, ఆనందం కోసం వాటిని చంపడం దారుణమని వారు అంటున్నారు.

Updated Date - 2021-05-19T03:05:07+05:30 IST