జైలు నుంచి విడుదలైన నొదీప్ కౌర్

ABN , First Publish Date - 2021-02-27T02:34:43+05:30 IST

నౌదీప్ కౌర్ ఇన్ని రోజులు హర్యానాలోని కర్నాల్ జైల్లో ఉన్నారు. జనవరి 12న అరెస్టైన ఆమెకు శుక్రవారం బెయిల్ లభించింది. నొదీప్ విడుదల గురించి అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు

జైలు నుంచి విడుదలైన నొదీప్ కౌర్

న్యూఢిల్లీ: నెలకు పైగా జైల్లో ఉన్న కార్మిక హక్కుల పోరాట కార్యకర్త నొదీప్ కౌర్ శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది. హర్యాణాలోని కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నొదీప్ కౌర్ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నౌదీప్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


నొదీప్ కౌర్ ఇన్ని రోజులు హర్యానాలోని కర్నాల్ జైల్లో ఉన్నారు.  జనవరి 12న అరెస్టైన ఆమెకు శుక్రవారం బెయిల్ లభించింది. నొదీప్ విడుదల గురించి అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న 25 ఏళ్ల భారత కార్మిక హక్కుల కార్యకర్త నొదీప్ కౌర్‌ను విడుదల చేయాలని తన ట్వీట్‌లో ఆమె కోరారు. అంతే కాకుండా నోదీప్ కౌర్ అరెస్ట్ మీద అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమమైంది.

Updated Date - 2021-02-27T02:34:43+05:30 IST