ట్విటర్‌లో మళ్లీ ‘అకౌంట్ వెరిఫికేషన్’
ABN , First Publish Date - 2021-05-21T09:05:24+05:30 IST
కొన్నేళ్ల క్రితం తమ ప్లాట్‌ఫాంలో అకౌంట్ వెరిఫికేషన్ విధానాన్ని నిలిపివేసిన సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్విటర్..

న్యూఢిల్లీ, మే 20 : కొన్నేళ్ల క్రితం తమ ప్లాట్‌ఫాంలో అకౌంట్ వెరిఫికేషన్ విధానాన్ని నిలిపివేసిన సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్విటర్.. గురువారం నుంచి తిరిగి ఆ సేవను ప్రారంభించింది. ట్విటర్‌లో ఏదైనా అకౌంట్ అసలుదా..? నకిలీదా..? తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ట్విటర్ ఒక అకౌంట్‌ను ధ్రువీకరిస్తే దానికి తెలుపు టిక్ మార్క్, నీలి రంగుతో కూడిన వెరిఫైడ్ బ్యాడ్జ్ వస్తుంది.