ఇస్లాం ప్రకారం విడిపోయినా భరణం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-10-21T08:13:53+05:30 IST

స్లాం ప్రకారం భార్యాభర్తలు విడిపోయినప్పటికీ.. భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది...

ఇస్లాం ప్రకారం విడిపోయినా భరణం ఇవ్వాలి

కర్ణాటక హైకోర్టు తీర్పు 

బెంగళూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఇస్లాం ప్రకారం భార్యాభర్తలు విడిపోయినప్పటికీ.. భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. విడిపోయినంత మాత్రాన భరణం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇస్లాంలో వివాహం ఒక ఒప్పందమే అయినప్పటికీ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. బెంగళూరులోని భువనేశ్వరీనగర్‌కు చెందిన ఎజాజుర్‌ రెహమాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారణ ముగియగా.. హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. 

Updated Date - 2021-10-21T08:13:53+05:30 IST