కోచిలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-02T08:25:10+05:30 IST

కేరళలోని కోచిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. అందాల పోటీల్లో కిరీటాలు కైవసం చెసుకున్న ఇద్దరు సుందరీమణులు దుర్మరణం చెందారు......

కోచిలో ఘోర రోడ్డు ప్రమాదం

మిస్‌ సౌత్‌ ఇండియా అన్సీ దుర్మరణం

మిస్‌ కేరళ-2019 రన్నరప్‌ 

అంజనా కూడా మృతి

తిరువనంతపురం, నవంబరు 1: కేరళలోని కోచిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. అందాల పోటీల్లో కిరీటాలు కైవసం చెసుకున్న ఇద్దరు సుందరీమణులు దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున అన్సీ కబీర్‌(25), డాక్టర్‌ అంజనా షాజన్‌, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ధాటికి కారు తుక్కుతుక్కయింది. హైవేలో వెళ్తుండగా స్కూటర్‌ను తప్పించబోయి కారుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అన్సీ, అంజనాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. మూడో వ్యక్తి, డ్రైవరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా.. తిరువనంతపురం జిల్లాలోని ఆలంకోడేకు చెందిన అన్సీ కబీర్‌.. 2019లో మిస్‌ కేరళ పోటీల విజేత.. 2021లో మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మోడల్‌, డాక్టర్‌ అంజనా షాజన్‌ 2019 మిస్‌ కేరళ అందాల పోటీల్లో రన్నర్‌పగా నిలిచారు.

Updated Date - 2021-11-02T08:25:10+05:30 IST