ప్రభుత్వాధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-02-01T13:00:40+05:30 IST

రాణీపేట జిల్లా అరక్కోణంలో ఓ ప్రభుత్వాధికారి నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించిన అవినీతి నిరోధకశాఖ అధికారులు రూ.1.35 కోట్ల విలువైన

ప్రభుత్వాధికారి ఇంట్లో  ఏసీబీ తనిఖీలు

రూ.1.35 కోట్ల పత్రాల స్వాధీనం

చెన్నై/ప్యారీస్‌ (ఆంధ్రజ్యోతి): రాణీపేట జిల్లా అరక్కోణంలో ఓ ప్రభుత్వాధికారి నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించిన అవినీతి నిరోధకశాఖ అధికారులు రూ.1.35 కోట్ల విలువైన ఆస్తుల దస్తావేజులు స్వాధీనం చేసుకు న్నారు. అరక్కోణం రత్నచంద్‌నగర్‌లో నివసిస్తున్న గోపి (39) కాంచీపురంలో గ్రామీణాభివృద్ధి కార్యా లయంలో ఆడిటింగ్‌ విభాగంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదుల మేర కు ఏసీబీ అధికారులు స్పందించారు. ఆ మేరకు వేలూరు అవినీతి నిరోధకశాఖ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి నేతృత్వంలోని బృందం శనివారం గోపి ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.1.35 కోట్ల విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకుంది. 

Updated Date - 2021-02-01T13:00:40+05:30 IST