9 ఏళ్ల తర్వాత మాయావతికి సారీ చెప్పిన కమెడియన్

ABN , First Publish Date - 2021-05-21T17:19:53+05:30 IST

9 ఏళ్ల తర్వాత మాయావతికి సారీ చెప్పిన కమెడియన్

9 ఏళ్ల తర్వాత మాయావతికి సారీ చెప్పిన కమెడియన్

ముంబై: బహుజన సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను సుమారు 9 ఏళ్ల తర్వాత క్షమాపణలు కోరాడు కమెడియన్ అబిష్ మాథ్యూ. గురువారం తన ట్వట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘ఒక్కసారిగా నా పాత ట్వీట్ చూడగానే ఖంగుతిన్నాను. ఆ ట్వీట్‌ ఎంత భయంకరంగా ఉందో అర్థమైంది. అందుకే వెంటనే క్షమాపణలు చెబుతున్నాను. జరిగిన నష్టాన్ని ఈ క్షమాపణ చెరిపివేయదని తెలుసు. కానీ నిజంగా నేను ఎంతో పశ్చాత్తాప పడుతున్నాను’’ అని ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చాడు. తన ట్వీట్‌లో ఎక్కడా మాయావతి పేరు ప్రస్తావించకుండానే క్షమాపణలు చెబుతున్న ఒక నోట్‌ను షేర్ చేసి ‘‘నా హృదయపూర్వక క్షమాపణలు’’ అని ట్వీట్ చేశారు.


మాయవతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్షాలు సహా పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అదే సందర్భంలో అబిష్ మాథ్యూ కూడా మాయావతిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘అందవిహీనమైన మాయావతికి విగ్రహాలు మాత్రమే పెట్టడం తెలుసు’’ అంటూ 2012లో ట్వీట్ చేశారు. దీనికి ఇది సరదా వాఖ్య అంటూ హ్యాష్‌ట్యాగ్ జోడించారు. కాగా, దీనిపై బీఎస్‌పీ సానిభూతిపరులు సహా అనేక మంది తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన పాత ట్వీట్‌ను చూసుకుని వెంటనే క్షమాపణలు చెబుతున్నట్లు అబిష్ మాథ్యూ ప్రకటించారు.Updated Date - 2021-05-21T17:19:53+05:30 IST