సీనియర్ ఐపీఎస్ అధికారిపై విచారణకు ఆప్ డిమాండ్

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి, గత బీజేపీ ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ...

సీనియర్ ఐపీఎస్ అధికారిపై విచారణకు ఆప్ డిమాండ్

ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి, గత బీజేపీ ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు ఐపీఎస్ అధికారి దేవెన్ భారతిపై చర్యలు తీసుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మహారాష్ట్ర పోలీస్ అధికారి సచిన్ వాజే అరెస్ట్, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ ఆరోపణల నేపథ్యంలో ఆప్ నేత ప్రీతి శర్మ మీనన్ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. నెల రోజుల క్రితమే దేవెన్ భారతిపై సీఎం ఉద్ధవ్ థాకరేకి విశ్రాంత ఏసీపీ రాజేంద్ర త్రివేది లేఖ రాశారని మీనన్ పేర్కొన్నారు. దేవెన్ భారతిపై సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పాండే విచారణ చేసినప్పటికీ... పరమ్ బీర్ సింగ్ దాన్ని అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భారతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేదనీ.. ఆయనపై ‘‘బహిరంగ’’ విచారణ చేపట్టాలని ఆప్ డిమాండ్ చేసింది.

Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST