ఏడాదిన్నర తర్వాత కశ్మీర్‌లో మళ్లీ 4జీ

ABN , First Publish Date - 2021-02-06T07:50:55+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది.

ఏడాదిన్నర తర్వాత కశ్మీర్‌లో మళ్లీ 4జీ

జమ్ము, ఫిబ్రవరి 5: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. యావత్‌ జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు పునఃప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.

2019 ఆగస్టులో  ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసినప్పటి నుంచి ఈ సేవలను నిలిపివేశారు. తాజాగా మళ్లీ ప్రారంభించారు.


Updated Date - 2021-02-06T07:50:55+05:30 IST