అమెరికాలో సిక్కు యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2021-05-05T08:11:52+05:30 IST

అమెరికాలో ఓ సిక్కు యువకుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఓ నల్లజాతీయుడైన దుండగుడు బిగ్గరగా అరుస్తూ సుత్తితో దాడి చేశాడు...

అమెరికాలో సిక్కు యువకుడిపై దాడి

న్యూయార్క్‌, మే 4: అమెరికాలో ఓ సిక్కు యువకుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఓ నల్లజాతీయుడైన దుండగుడు బిగ్గరగా అరుస్తూ సుత్తితో దాడి చేశాడు. న్యూయార్క్‌ బ్రూక్లిన్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్టోరియాకు చెందిన 32 ఏళ్ల సుమిత్‌ అహ్లువాలియాపై ఏప్రిల్‌ 26న ఈ దాడి జరిగింది. ఆయన తలకి గాయమైంది. 


Updated Date - 2021-05-05T08:11:52+05:30 IST