ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-21T16:51:55+05:30 IST

సీనియర్ కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ

ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు

ముజఫర్‌పూర్ (బిహార్) : సీనియర్ కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ సింగ్, పి చిదంబరంలపై స్థానిక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ ఫిర్యాదు దాఖలైంది. వీరు హిందూ మతాన్ని కించపరిచారని పిటిషనర్ ఆరోపించారు. సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య’’ పుస్తకంలో ఓ అధ్యాయం హిందుత్వానికి అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. 


ముజఫర్‌పూర్ వాసి ఆచార్య చంద్ర కిశోర్ పరాశర్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది కమలేశ్ కుమార్ మాట్లాడుతూ, సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య’’లో ‘శాఫ్రన్ స్కై’ అనే అధ్యాయం హిందూ మతాన్ని కించపరిచేవిధంగా ఉందని చెప్పారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ సింగ్, పి చిదంబరం రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపించారు. 


ఇదిలావుండగా, ఈ పుస్తకంపై నిషేధం విధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. సల్మాన్ ఖుర్షీద్ హిందువులను అవమానించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-11-21T16:51:55+05:30 IST