బౌద్ధ పర్యాటకానికి ఊతం

ABN , First Publish Date - 2021-10-21T08:06:14+05:30 IST

దేశంలో బౌద్ధ పర్యాటకానికి ఊతమిచ్చేలా ఉత్తరప్రదేశ్‌లోని బౌద్ధ క్షేత్రం కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు....

బౌద్ధ పర్యాటకానికి ఊతం

కుషీనగర్‌ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన మోదీ 

కుషీనగర్‌, అక్టోబరు 20: దేశంలో బౌద్ధ పర్యాటకానికి ఊతమిచ్చేలా ఉత్తరప్రదేశ్‌లోని బౌద్ధ క్షేత్రం కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టులో తొలిసారిగా మంద మందికిపైగా బౌద్ధ సన్యాసులు, ప్రముఖులతో వచ్చిన శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం ఉదయం 9గంటలకు ల్యాండ్‌ అయింది. వారికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పలువురు కేంద్రమంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుషీనగర్‌ ఎయిర్‌పోర్టుతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ నిర్ణయం దేశ విమానయాన రంగానికి మరింత శక్తినిస్తుందన్నారు. గత కొన్నేళ్లలో 900కు పైగా కొత్త రూట్లు ఆమోదం పొందాయని, ఇంతకుముందు వినియోగంలో లేని 50 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నుంచి కుషీనగర్‌కు త్వరలో విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా అన్నారు. నవంబరు 26నుంచి ఢిల్లీ-కుషీనగర్‌ మధ్య వారానికి 4 విమాన సర్వీసులు నడుస్తాయన్నారు.

Updated Date - 2021-10-21T08:06:14+05:30 IST