9 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు

ABN , First Publish Date - 2021-10-07T14:48:12+05:30 IST

మద్రాస్‌ హైకోర్టుకు, మదురై బెంచ్‌కు ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే ఈనెల 12న అత్యవసర పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఆ రోజు మద్రాస్‌ హైకోర్టులో జస్టిస్‌ మహా

9 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు

చెన్నై: మద్రాస్‌ హైకోర్టుకు, మదురై బెంచ్‌కు ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే ఈనెల 12న అత్యవసర పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఆ రోజు మద్రాస్‌ హైకోర్టులో జస్టిస్‌ మహాదేవన్‌, జస్టిస్‌ వి.పార్తీబన్‌, జస్టిస్‌ అబ్దుల్‌ ఖుద్దూస్‌, జస్టిస్‌ ఎస్‌. శక్తికుమార్‌ పిటిషన్లపై విచారణ జరుపుతారు. ఇక మదురై బెంచ్‌లో జస్టిస్‌ పి. వేల్‌ మురుగన్‌, జస్టిస్‌ ఎస్‌. ఆనంది, జస్టిస్‌ టీవీ తమిళ్‌సెల్వి అత్యవసర పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

Updated Date - 2021-10-07T14:48:12+05:30 IST