ఢిల్లీలో 963 కరోనా కేసులు.. వాటిలో ఒమిక్రాన్ ఎన్నంటే..
ABN , First Publish Date - 2021-12-30T19:38:20+05:30 IST
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రర్ జైన్ తెలిపారు.

ఢిల్లీ : ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రర్ జైన్ తెలిపారు. 344 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2191కి చేరింది. పాజిటివీటి రేటు 1.29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 263కి చేరింది. తాజా జినోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవేనని సత్యేంద్రర్ జైన్ తెలిపారు.