93 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2021-07-08T14:14:53+05:30 IST

దక్షిణ రైల్వే పరిధిలోని 93 రైల్వేస్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయా

93 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు

పెరంబూర్‌(చెన్నై): దక్షిణ రైల్వే పరిధిలోని 93 రైల్వేస్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం 2016లో దేశవ్యాప్తంగా 983 రైల్వేస్టేషన్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం 813 స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన 47 రైల్వేస్టేషన్లలో కెమెరాల ఏర్పాటు తుదిదశలో ఉందని, ‘నిర్భయ’ నిధుల నుంచి ఈ పథకం అమలుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-08T14:14:53+05:30 IST