యోగా దినోత్స‌వం: న్యూయార్క్ నుంచి ల‌ధాక్ వ‌ర‌కూ....

ABN , First Publish Date - 2021-06-21T14:17:23+05:30 IST

ఈరోజు (జూన్ 21) అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం.

యోగా దినోత్స‌వం: న్యూయార్క్ నుంచి ల‌ధాక్  వ‌ర‌కూ....

న్యూఢిల్లీ: ఈరోజు (జూన్ 21) అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా అమెరికాలోని న్యూయార్క్ మొద‌లుకొని మ‌న‌దేశంలోని ల‌ధాక్ వ‌ర‌కూ ప్ర‌జ‌లు యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.  మ‌న‌దేశంలోని గాల్వాన్ లోయ, లధాక్‌లోని 18 వేల అడుగుల ఎత్తయిన ప‌ర్వ‌త శ్రేణిపై ఐటీబీపీ సైనికులు యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అత్యంత చ‌లి ప్ర‌దేశంలోనూ యోగా  చేస్తుండ‌టం కార‌ణంగా తాము ఆరోగ్యంగా ఉన్నామ‌ని వారు సందేశ‌మిచ్చారు. అమెరికాలోని న్యూయార్క్‌లోగ‌ల టైమ్ స్క్యేర్ వ‌ద్ద  యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మూడు వేల‌మంది అమెరిక‌న్లు పాల్గొన్నారు. మ‌న‌దేశంలోని హ‌రిద్వార్‌లో యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్వ‌ర్యంలో యోగా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 

Updated Date - 2021-06-21T14:17:23+05:30 IST