చెన్నై చేరిన మరో 72 వేల డోసుల కొవాగ్జిన్‌

ABN , First Publish Date - 2021-05-20T15:39:14+05:30 IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పంపిన 72 వేల డోసుల కోవాగ్జిన్‌ హైదరాబాద్‌

చెన్నై చేరిన మరో 72 వేల డోసుల కొవాగ్జిన్‌

చెన్నై: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పంపిన 72 వేల డోసుల కోవాగ్జిన్‌ హైదరాబాద్‌ నుంచి విమానంలో చెన్నై చేరింది. ఆరు పార్శిళ్లలో వున్న వ్యాక్సిన్లను ఆరోగ్యశాఖ అధికారులు స్వీకరించారు.  బుధవారం ఉదయం 9.10 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానంలో చెన్నై చేరుకున్న 72 వేల డోస్‌ల కోవాగ్జిన్‌ పార్శిళ్లను రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్వీకరించారు. వాటిని కంటైనర్‌లో తేనాంపేట డీఎంఎస్‌ ప్రాంగణంలోని ప్రత్యేక గోదాముకు తరలించారు. అక్కడి నుంచి వివిద ప్రాంతాల్లోని ఆస్పత్రులు, వ్యాక్సినేషన్‌ సెంటర్లకు కోవాగ్జిన్‌ డోసులను అధికారులు పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-05-20T15:39:14+05:30 IST