చేపల తొట్టెలో గండభేరుండాససం
ABN , First Publish Date - 2021-01-20T17:04:38+05:30 IST
విరుదునగర్ శ్రీవిల్లిపుత్తూర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థిని చేపల తొట్టెలో పది నిమిషాల పాటు గండభేరుండ ఆసనం వేసింది. కోటికుళంకు చెందిన శీన్‌రాజ్, కన్నత్తాళ్ దంపతుల కుమార్తె ...

6వ తరగతి విద్యార్థిని ప్రతిభ
పెరంబూర్: విరుదునగర్ శ్రీవిల్లిపుత్తూర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థిని చేపల తొట్టెలో పది నిమిషాల పాటు గండభేరుండ ఆసనం వేసింది. కోటికుళంకు చెందిన శీన్‌రాజ్, కన్నత్తాళ్ దంపతుల కుమార్తె యోగవీణ (10) కూమపట్టిలోని ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. యోగవీణకు చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంలో కోటికుళంలో ఉన్న కలై ఆరంగంలో నిర్వహించిన కార్యక్రమంలో, చేపల తొట్టెలో గండభేరుం డాసనం వేసి, పది నిమిషాలుండి సాధన చేసింది. ఇది గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదుచేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు యోగవీణను అభినందించి సర్టిఫికెట్ అందజేశారు.