పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌

ABN , First Publish Date - 2021-02-26T23:11:13+05:30 IST

Single stage polling in Puducherry

పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌

ఢిల్లీ: పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అయితే రాష్ట్ర హోదా కలిగి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి మరోమారు రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి సారథ్యంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఇన్‌ఛార్జ్‌)గా ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్‌ సిఫార్సు చేశారు. ఆమె సిఫార్సుకు కేంద్రమంత్రివర్గం అమోదం తెలుపుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఆయన కూడా కేంద్ర మంత్రిమండలి సిఫార్సులకు ఆమోదం తెలుపడంతో పుదుచ్చేరి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. 

Updated Date - 2021-02-26T23:11:13+05:30 IST