ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

ABN , First Publish Date - 2021-08-21T13:07:16+05:30 IST

తిరుప్పూర్‌లో ఆధార్‌, పాన్‌ కార్డులతో బంగ్లాదేశీయులు ఐదుగురు అరెస్టయ్యారు. తిరుప్పూర్‌ మండలంలో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశీ యులు నివసిస్తున్నారని పోలీసులకు సమా

ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

ఐసిఎఫ్‌(చెన్నై): తిరుప్పూర్‌లో ఆధార్‌, పాన్‌ కార్డులతో బంగ్లాదేశీయులు ఐదుగురు అరెస్టయ్యారు. తిరుప్పూర్‌ మండలంలో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశీ యులు నివసిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. మహమ్మద్‌ ఇజల్‌మియా(33) అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు అందించిన సమాచారంతో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఏడాదిన్నరగా మంగళంలో బసచేస్తూ వీరపాండి ప్రాంతంలో ఓ బనియన్‌ సంస్థలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-08-21T13:07:16+05:30 IST