డెల్టా ప్లస్‌తో 4వ మరణం
ABN , First Publish Date - 2021-06-27T09:42:55+05:30 IST
దేశంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మరో మరణం సంభవించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మృతిచెందగా..
మదురైకి చెందిన వ్యక్తి కన్నుమూత
న్యూఢిల్లీ, జూన్ 26: దేశంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మరో మరణం సంభవించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మృతిచెందగా.. తాజాగా తమిళనాడులోనూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఇప్పటివరకు 9 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. మహారాష్ట్ర (22) తర్వాత ఇక్కడే అత్యధికం ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మరో డెల్టా ప్లస్ కేసు నమోదైంది. దీంతో మొత్తం సంఖ్య 8కి చేరింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ సహా 12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు డెల్టా ప్లస్‌నూ ఆందోళన కారక వేరియంట్‌గా గుర్తించి చికిత్స అందేలా చూడాలని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ సూచించారు.
మళ్లీ 50 వేల దిగువన కొత్త కేసులు
దేశంలో కరోనా కొత్త కేసులు మరోసారి 50 వేల దిగువకు వచ్చాయి. శుక్రవారం 48,698 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైర్‌సతో మరో 1,183 మంది చనిపోయినట్లు పేర్కొంది. 44వ రోజూ కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌లు 6 లక్షల లోపునకు పడిపోయాయి. ప్రస్తుతం 5.95 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
బెంగాల్లో నకిలీ టీకాపై రాజకీయ రగడ
పశ్చిమ బెంగాల్లో.. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘నకిలీ టీకా శిబిరం’ మరింత నిప్పు రాజేస్తోంది. ఐఏఎస్ అధికారిగా చెప్పుకొంటూ శిబిరం నిర్వహించిన తృణమూల్ మహిళా ఎంపీ మిమి చక్రవర్తి సహా 500 మందికి టీకా పంపిణీ చేసిన దేవాంజన్ దేవ్ (28)కు అఽధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కాగా, నకిలీ శిబిరాల నిర్వహణపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీఎం మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించి నకిలీ టీకా తీసుకున్న మిమి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, ‘‘మనలో మనం పోరాడితే.. గెలిచేది కరోనానే..! మాపై మీ ఆక్సిజన్ దాడి పూర్తయితే.. కలిసి పోరాడుదాం. కరోనాపై దేశాన్ని గెలిపిద్దాం’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. దేశ రాజధాని నగరంలో ఆక్సిజన్ వినియోగం లెక్కలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య పోరుకు ముగింపు పలకాలని ఆయన పరోక్షంగా కోరారు.
టీకా వేయనిచోట డెల్టా ఉధృతి
డెల్టా వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు బయటపడిన వేరియంట్లు అన్నింటిలోకి డెల్టా అత్యంత వేగంగా వ్యాప్తిస్తున్నదని.. టీకా పంపిణీ ఎక్కువగా జరగని దేశాల్లో దీని ఉధృతి నెలకొందని పేర్కొంది. ప్రస్తుతం 85 దేశాల్లో డెల్టా కేసులు నమోదయ్యాయని.. రెండు వారాల్లోనే కొత్తగా 11 దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు. కాగా, చిన్నపిల్లలపై త్వరలో కోవోవాక్స్ 2, 3 దశల టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.